News
ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదు
పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ‍్నోత్తరాల సమయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై చర్చ జరిగింది. సభలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు లేవని, చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆరేళ్ల పాపకు పురుగులున్న సెలైన్ బాటిల్ ఎక్కించిన సంఘటనను రామ్మోహన్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పాప పరిస్థితి విషమంగా మారిందని, పేదల ఆరోగ‍్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 330 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, కేవలం 100 కోట్ల రూపాయలే ఇచ్చిందని అన్నారు. ఈ పథకం కింద నిమ్స్‌లో సరైన వసతులు లేవని చెప్పారు. నిధులలేమి కారణంగా రోగులు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








